News April 2, 2024
పుష్ప-2 అప్డేట్ ఇదేనా..?

పుష్ప-2 నుంచి ఇవాళ క్రేజీ అప్డేట్ రానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ ట్విటర్‌లో ‘పుష్ప-2’ను ట్రెండ్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్‌ను బీట్ చేసే మరో అప్డేట్ రానుందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. మరికొందరేమో సాంగ్ లేదా టీజర్ వదిలితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేం కోరుకుంటున్నారు?
Similar News
News February 17, 2026
300కు 300 మార్కులు

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.
News February 17, 2026
ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.
News February 17, 2026
కర్తరీ దోషం అంటే ఏమిటి?

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.


