News September 12, 2025

నేడు వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ ప్రమాణం

image

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

Similar News

News December 15, 2025

టమాటా కాయ ఆకృతి కోల్పోవడానికి కారణం ఏమిటి?

image

టమాటా కాయలు ఆకృతిని కోల్పోయే సమస్య ఎక్కువగా కాయలో పూత చివరి వైపు కనిపిస్తుంది. పిందె కట్టే దశలో చల్లని వాతావరణం వల్ల కాయ ఆకృతి కోల్పోతుంది. పెద్ద పరిమాణం గల కాయరకాల్లో ఈ సమస్య సాధారణంగా ఉంటుంది. దీని నివారణకు కలుపు మందులు లేదా పెరుగుదలను నియంత్రించే రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. టమాట పంటను మురుగు నీరు బయటకు పోయే వసతి లేని నేలల్లో పండించకూడదు.

News December 15, 2025

పెరగనున్న టీవీల ధరలు!

image

కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమొరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని తయారీ కంపెనీలు డీలర్లకు ఈ విషయం తెలియజేశాయని పేర్కొంటున్నాయి. గత మూడేళ్లలో మెమొరీ చిప్‌ల ధరలు 500% ఎగిశాయని, వచ్చే 6 నెలలూ పెరిగే అవకాశం ఉందని వెల్లడించాయి.

News December 15, 2025

AP న్యూస్ రౌండప్

image

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.