News September 9, 2024

భారత్‌ను అవమానించడం రాహుల్‌కు అలవాటైపోయింది: BJP

image

భారతదేశానికి ఒకే భావజాలం ఉందని ఆరెస్సెస్ భావిస్తుందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ నేతకు భారత్‌ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని విమర్శించింది. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తుంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

Similar News

News October 15, 2024

తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ మంత్రులకు ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు అన్వర్, అధిర్ రంజన్ చౌదరీని ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా నియమించింది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్కను మహారాష్ట్రలోని మరాఠ్వాడా, నార్త్ మహారాష్ట్ర రీజియన్లకు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 15, 2024

భారీ వర్షాలు.. వైద్యశాఖ అప్రమత్తం

image

AP: దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో ఎపిడెమిక్ సెల్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు పద్మావతి వెల్లడించారు. పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ప్రసవానికి వారం ముందే గర్భిణులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే రాష్ట్ర ఎపిడెమిక్ నంబర్(9032384168)కు ఫోన్ చేయాలన్నారు

News October 15, 2024

యువతిపై అత్యాచారం.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి: హరీశ్

image

TG: హై సెక్యూరిటి ప్రాంతంగా చెప్పుకునే <<14360357>>గచ్చిబౌలిలో ఉద్యోగినిపై అత్యాచార<<>> ఘటన వల్ల ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని దుయ్యబట్టారు. బాధితురాలికి భరోసా కల్పించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.