News May 14, 2024
TG: రానున్న 2 గంటల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. MBNR, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Similar News
News December 16, 2025
చియా ఫేస్‌ప్యాక్‌తో ముఖానికి మెరుపు

ముఖంపై ముడతలు తగ్గి, అందంగా కనిపించడానికి చియాసీడ్స్ ప్యాక్ ఉపయోగపడుతుంది. చియాసీడ్స్‌ను నీటిలో లేదా కలబందగుజ్జులో పావుగంట నానబెట్టాలి. దీనికి కాస్త తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగెయ్యాలి. ఈ మాస్క్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, చర్మకణాల్లో కొలాజెన్‌ను పెంచుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, కొత్త కాంతి వస్తుంది.
News December 16, 2025
దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.
News December 16, 2025
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాల్సిందే: NMC

డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ వాళ్లకు తప్ప ఎవరికీ అర్థం కాదనే మాటలు వింటుంటాం. దీనికి చెక్ పెట్టేలా నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌ను స్పష్టంగా, అర్థమయ్యేలా, క్యాపిటల్స్ లెటర్స్‌లో రాయాలని స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా అమలయ్యేలా ప్రత్యేక కమిటీలు వేయాలని మెడికల్ కాలేజీలను ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.


