News September 1, 2024

దేశంలో వద్దంటే వానలు?

image

దేశవ్యాప్తంగా అసాధారణ వర్షపాతం నమోదవుతోందని IMD తెలిపింది. ఆగస్టులో సాధారణం కంటే 16 శాతం ఎక్కువగా వర్షాలు కురిసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా గత నెలలో 287.1 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. హిమాలయ రాష్ట్రాల్లో వరదలకు దారి తీయొచ్చని పేర్కొంది. దక్షిణాదిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.

Similar News

News February 11, 2025

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్… ఆ వాహనాలకు నో ఎంట్రీ

image

APలో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్నకోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 24చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ పై పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఏపీలో ఈవైరస్ సోకి వేలసంఖ్యలో కోళ్లు మృతిచెందిన సంగతి తెలిసిందే.

News February 11, 2025

సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.

News February 11, 2025

మద్యం ధరల పెంపుతో రూ.150 కోట్ల ఆదాయం: కొల్లు

image

AP: YCP హయాంలో నకిలీ బ్రాండ్లతో మద్యం విక్రయాలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం డిపోలను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల్లో ₹12K కోట్లు తాము చెల్లించామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా లిక్కర్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. బాటిల్‌పై రేటు ₹10 పెంచామని, దీనివల్ల ప్రభుత్వానికి ₹150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామన్నారు.

error: Content is protected !!