News June 18, 2024
ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు

AP: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వేడి, ఉక్కపోత కొనసాగుతోంది. నిన్న తునిలో అత్యధికంగా 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
Similar News
News January 24, 2026
ఆర్ఓబి ఆర్యుబీలను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద మంజూరైన ఆర్వోబీ, ఆర్యూబీలను రైల్వే–రెవెన్యూ శాఖల సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఫిబ్రవరి మొదటి వారంలోగా ప్రతిపాదన దశలో ఉన్న 20 పనులకు సంయుక్త తనిఖీలు పూర్తిచేయాలన్నారు. డీపీఆర్లు పూర్తయిన 11 ఆర్వోబీ/ఆర్యూబీ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
News January 24, 2026
ఈనెల 29న పెనుమంట్రలో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29న పెనుమంట్ర ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సును మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News January 24, 2026
TODAY HEADLINES

⋆ తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
⋆ ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు
⋆ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ
⋆ పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR
⋆ తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI
⋆ రెండో టీ20లో NZపై భారత్ విజయం
⋆ WHO నుంచి వైదొలగిన అమెరికా


