News February 20, 2025

రాజలింగమూర్తి హత్య.. సీఎం ఆరా!

image

TG: భూపాలపల్లిలో నడిరోడ్డుపై రాజలింగమూర్తి <<15516581>>హత్య ఘటనపై<<>> సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు మేడి‌గడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమని కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా భూవివాదమే హత్యకు కారణమని సమాచారం.

Similar News

News March 16, 2025

టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

image

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్‌ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.

News March 16, 2025

ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతి నొప్పి, ఆస్పత్రిలో చేరిక

image

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News March 16, 2025

గ్రూప్-1 ఫలితాల మూల్యాంకనంలో లోపాలు: ప్రసన్న హరికృష్ణ

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడంపై MLC అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని అన్నారు. సబ్జెక్టులపై అవగాహన లేని వారితో వాల్యుయేషన్ చేయించారని, EM బ్లూప్రింట్‌ను TMలోకి ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వడంతో TM వారికి అన్యాయం జరిగిందన్నారు. టాప్-100లో TM, ఉర్దూ మీడియం వారు ఎందరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!