News April 23, 2025

రాజశేఖర్‌కు మే 6 వరకు రిమాండ్

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌కు ఏసీబీ కోర్టు మే 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో మొత్తం 29 మందిని సిట్ నిందితులుగా చేర్చింది. A1గా రాజశేఖర్‌ను పేర్కొంది. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేసింది.

Similar News

News March 13, 2026

ఇంటర్ స్టూడెంట్ దారుణం.. ముగ్గురు బాలికలపై అత్యాచారం

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి కామాంధుడిగా మారిన ఘటన నాగర్‌కర్నూల్(D) కొల్లాపూర్(M)లో జరిగింది. ప్రేమ పేరుతో ముగ్గురు తోటి విద్యార్థినులపై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. డబ్బు ఇవ్వకపోతే వాటిని పేరెంట్స్‌కు పంపుతానని, SMలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఓ బాలిక గర్భం దాల్చగా ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. ఓ విద్యార్థిని ఫిర్యాదుతో బాలుడితోపాటు ఇద్దరు వైద్యులు, నర్సును పోలీసులు అరెస్టు చేశారు.

News March 13, 2026

SEBI హోల్ టైమ్ మెంబర్‌గా తెలుగు వ్యక్తి!

image

స్టాక్ మార్కెట్లను పర్యవేక్షించే సెక్యూరిటీస్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో తెలుగు వ్యక్తికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. SEBI హోల్ టైమ్ మెంబర్‌గా మాజీ IDAS అధికారి కేవీ రమణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతంలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ ప్రతినిధిగా SEBIలో పార్ట్‌టైమ్ మెంబర్‌గా పనిచేశారు. సెబీ నిర్ణయాల్లో ఈయన కీలక పాత్ర పోషించనున్నారు.

News March 13, 2026

ఇళ్లు లేనివారికి శుభవార్త

image

AP: రాష్ట్రంలో అర్హులందరికీ రెండేళ్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. అందుబాటులో ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీల్లో మంజూరైన ఇళ్లు వద్దనుకుంటే రద్దు చేసి, అక్కడే లేదా మరో చోట 3 సెంట్లు ఇవ్వాలని పేర్కొన్నారు.