News March 24, 2024
లక్నోపై రాజస్థాన్ గెలుపు

IPL2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20ఓవర్లలో 193 రన్స్ చేసింది. ఛేదనలో లక్నో 173/6కే పరిమితమైంది. రాజస్థాన్ కెప్టెన్ శాంసన్(82*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు.
Similar News
News December 6, 2025
మెదడు పనితీరు మందగించకూడదంటే..

40 ఏళ్ల వయసు దాటితే మెదడు పనితీరు మందగిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కింది అలవాట్లతో ఆ రిస్క్ నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
*రోజు 30 నిమిషాల పాటు నడవాలి
*7-8 గంటలు నిద్రపోవాలి
*వారానికి రెండుసార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (ఎక్సర్‌సైజ్) చేయాలి
*కొత్త భాష, హాబీ, స్కిల్ లాంటివి నేర్చుకోవాలి
*బీపీ, డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి
Share It
News December 6, 2025
కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.
News December 6, 2025
ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.


