News August 14, 2025

రజినీకాంత్ ‘కూలీ’ రివ్యూ&రేటింగ్

image

మిత్రుడి(సత్యరాజ్)ని ఎవరు, ఎందుకు చంపారో హీరో(రజినీకాంత్) తెలుసుకునే క్రమంలో జరిగే సంఘటనలే ‘కూలీ’ స్టోరీ. ఎప్పటిలాగే రజినీ ఎలివేషన్స్ అభిమానులకు నచ్చుతాయి. యాక్షన్ సీన్లు, కొన్నిచోట్ల ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కథ పెద్దది కావడంతో సెకండాఫ్‌ సాగదీతలా అనిపిస్తుంది. నాగార్జున పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అక్కడక్కడ డౌన్ కావడం మైనస్‌.
రేటింగ్-2.5/5

Similar News

News March 6, 2026

ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.

News March 6, 2026

ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

image

తన ఏజ్‌లెస్ లుక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్‌నెస్‌కు కారణమని అతను చెబుతుంటారు.

News March 6, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 6)

image

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం