News April 12, 2024
రామ్ చరణ్, జాన్వీ ఆ సినిమా సీక్వెల్ చేయాలి: చిరంజీవి

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. త్వరలోనే ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చరణ్‌తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతుంటే శ్రీదేవి గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యా. ఇండస్ట్రీ ఓ మంచి నటిని కోల్పోయింది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
ఫీటల్ బ్రాడీకార్డియా గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో పిండం కనీసం 7 మిల్లీమీటర్ల పొడవు ఉన్నప్పుడు డాక్టర్ సాధారణంగా బిడ్డ గుండె చప్పుడుని వినగలరని నిపుణులు చెబుతున్నారు. దీనిని గుర్తించలేకపోతే మరో వారంలో మరో స్కాన్ తీస్తారు. ఫీటల్ బ్రాడీకార్డియా ఉన్నప్పుడు గుండె కండరాలకి సిగ్నల్ ఆలస్యంగా ఉండడం, గుండె వ్యవస్థలో సమస్య, గుండె పై, కింది గదుల మధ్య సమస్య ఏర్పడతాయి. ఇలాంటప్పుడు తల్లి పరిస్థితిని బట్టి డాక్టర్స్ సరైన ట్రీట్‌మెంట్‌ని ఇస్తారు.
News December 9, 2025
సినిమా వాయిదా..! దర్శకుడి ఎమోషనల్ పోస్ట్

‘మోగ్లీ’ రిలీజ్ వాయిదా అంటూ ప్రచారం నడుమ డైరెక్టర్ సందీప్ రాజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘అంతా సర్దుకుందనుకుంటున్న టైంలో మోగ్లీ చిత్ర విడుదలకు బ్యాడ్ లక్ ఎదురవుతోంది. డైరెక్టర్ సందీప్ రాజ్ అనే టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకున్న కల రోజురోజుకూ కష్టమవుతోంది. వెండితెరకు నేను ఇష్టం లేదేమో. అంకితభావంతో పనిచేసిన రోషన్, సరోజ్, సాక్షి వంటి వారికోసమైనా అంతా మంచి జరగాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News December 9, 2025
ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: రామ్మోహన్ నాయుడు

ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ‘ఇండిగో సంక్షోభంపై విచారణకు ఆదేశించాం. ప్రయాణికుల ఇబ్బందికి యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ప్రయాణికుల భద్రతే ముఖ్యం. ఇప్పటికే DGCA నోటీసులు జారీ చేసింది. జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇండిగోపై ఉంది. DGCA రిపోర్టు ఆధారంగా చర్యలు ఉంటాయి. కొత్త నిబంధనలు పాటిస్తామని ఇండిగో వివరణ ఇచ్చింది.’ అని తెలిపారు.


