News December 3, 2024

‘పుష్ప-2’ క్రేజ్‌పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

image

‘పుష్ప-2’ సినిమాపై వస్తోన్న క్రేజ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘పుష్ప-2కు వస్తోన్న మెగా క్రేజ్ చూస్తుంటే తదుపరి మెగా అల్లునే. బన్నీ మీరు బాహుబలి కాదు. కానీ, స్టార్స్‌లో మెగాబలి’ అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆయన తీస్తోన్న ‘శారీ’ మూవీ పోస్టర్‌ను అటాచ్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటోనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 24, 2025

12 వికెట్లు తీసిన జడేజా

image

రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్‌రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

News January 24, 2025

ICC టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్.. భారత్ నుంచి ముగ్గురు

image

టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. జట్టు: కమిన్స్, జైస్వాల్, బెన్ డకెట్, విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్, జడేజా, హెన్రీ, బుమ్రా.

News January 24, 2025

CID చేతికి కిడ్నీ రాకెట్ కేసు: మంత్రి దామోదర

image

TG: హైదరాబాద్‌లోని అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలు వసూలు చేశారని సమాచారం.