News August 2, 2024
ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి

AP: మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.
Similar News
News December 10, 2025
వరంగల్: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు వేలయింది..!

జిల్లాలో ప్రచారానికి తెరపడడంతో పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, నగదు పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీ పోలింగ్‌కు అధికారులు 800 బూత్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మఫ్టీలో పోలీసులు పర్యటిస్తూ శాంతిభద్రతలకు చర్యలు చేపడుతున్నారు.
News December 10, 2025
ఎండోమెట్రియోసిస్‌తో క్యాన్సర్ ముప్పు

ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎండోమెట్రియాయిడ్ కార్సినోమా, క్లియర్ సెల్ కార్సినోమాకు కారణమవుతుంది. సమస్యను గుర్తించేందుకు MRI లేదా అల్ట్రాసౌండ్ చేస్తారు. రిపోర్ట్స్‌లో అసాధారణ లక్షణాలు ఉన్న తిత్తిని గుర్తిస్తే.. శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులు చేసుకుంటే ఈ ముప్పును తగ్గించొచ్చని చెబుతున్నారు.
News December 10, 2025
అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.


