News January 31, 2025
రంజీ ప్రదర్శన రోహిత్‌ను ప్రభావితం చేయదు: దినేశ్ కార్తీక్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ BGTలో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా రంజీ మ్యాచ్‌లోనూ 3, 28 పరుగులతో నిరాశ పరిచారు. అయితే, త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ప్రదర్శన ఆయన్ను ప్రభావితం చేయదని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ మళ్లీ లయలోకి వచ్చేందుకు సాధన చేస్తున్నారు. BGTలో ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు. అందువల్ల రంజీ వైఫల్యం ఇంపాక్ట్ ఉండదనే అనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 17, 2025
నేటి నుంచి GOVT స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.
News February 17, 2025
26.77 కోట్ల ‘ఉపాధి’ పనిదినాలు కేటాయించండి: కేంద్రంతో ఏపీ

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.
News February 17, 2025
టెక్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు. ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్, భవిష్య సాంకేతికాభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.