News November 15, 2024
ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జిగా రవిబాబు
AP: ఒంగోలు నియోజకవర్గ YCP ఇన్‌ఛార్జిగా చుండూరి రవిబాబును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ (శ్రీకాకుళం), బొడ్డేడ ప్రసాద్ (అనకాపల్లి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించింది. ఆముదాలవలస YCP సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News December 13, 2024
స్టాక్ మార్కెట్స్: -1000 నుంచి +400కు సెన్సెక్స్
స్టాక్‌మార్కెట్లు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పడిపోయి మళ్లీ పెరుగుతున్నాయి. సూచీల దిశ ఏంటో తెలియక ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. నిఫ్టీ 300 పాయింట్ల నష్టాన్ని పూడ్చుకొని 114 పాయింట్ల లాభంతో 24,662 వద్ద ట్రేడవుతోంది. -1000 పాయింట్ల నుంచి పుంజుకొన్న సెన్సెక్స్ 432 పాయింట్ల లాభంతో 81,719 వద్ద కొనసాగుతోంది. IT, FMCG స్టాక్స్ రికవరీకి సాయపడ్డాయి. AIRTEL, HCLTECH, ULTRATECH షేర్లు పెరిగాయి.
News December 13, 2024
టూరిస్ట్ డెస్టినేషన్‌గా ఏపీ: పవన్ కళ్యాణ్
AP: రాష్ట్రాన్ని టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి సారథ్యంలో రాష్ట్రం దూసుకెళ్తుంది. గోవా వంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌లు నాశనమయ్యాయి. మన రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు
News December 13, 2024
ప్రభాస్ ‘కల్కి’ మరో ఘనత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా మరో ఘనత సాధించింది. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వెతికిన మూవీగా నిలిచింది. ఈ విషయాన్ని గూగుల్ ఇండియా పేర్కొంది. ‘ఆలస్యం అయ్యిందా? కల్కి ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోవడంతో ఈలలు వేయడాన్ని ఆపలేకపోయారు. కల్కి 2024లో అత్యధిక ట్రెండింగ్ అయిన చలన చిత్ర శోధనలో ఒకటిగా నిలిచింది’ అని తెలిపింది.