News April 25, 2024

RCB స్కోర్ 206.. SRHకి సరిపోతుందా?

image

SRHతో మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన RCB 20ఓవర్లలో 7 వికెట్లకు 206 రన్స్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ కోహ్లీ(51)కి తోడు పాటీదార్(50) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు. చివర్లో గ్రీన్(37) రాణించడంతో RCB 200 మార్క్ దాటింది. SRH బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో రాణించారు. మరి SRHకి ఈ స్కోర్ సరిపోతుందా? కామెంట్ చేయండి.

Similar News

News April 15, 2026

FLASH.. HYD: తమ్ముడిని చంపిన అన్న

image

చాదర్‌ఘాట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. అజంపురాలోని ముస్లిం మెటర్నిటీ ఆస్పత్రి వెనుక జరిగిన ఘర్షణలో తమ్ముడు షాప్‌దాన్ హుస్సేన్‌‌ని అన్న హాషిం హుస్సేన్‌ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ సీఐ ఆధారాలు సేకరిస్తున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News April 15, 2026

డీలిమిటేషన్.. BJP ప్లాన్‌తో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి

image

డీలిమిటేషన్‌ను మహిళా రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టడంతో ప్రతిపక్షాల పరిస్థితి ‘మింగలేక కక్కలేక’ అన్నట్లుగా మారింది. వ్యతిరేకిస్తే మహిళా వ్యతిరేకుల ముద్ర పడుతుందని, సమర్థిస్తే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గుతుందని ఆందోళన చెందుతున్నాయి. మహిళా సాధికారత సెంటిమెంట్‌ను ముందుపెట్టి, సీట్లను పెంచుకొని తమకు రాజకీయంగా చెక్ పెట్టాలని BJP చూస్తోందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

News April 15, 2026

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.