News April 22, 2024
RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

ఈ ఏడాదీ RCBకి అదృష్టం కలిసి రాలేదు. 8 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఏదైనా జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. RCB మిగిలిన 6 మ్యాచ్‌లను భారీ మార్జిన్‌లతో గెలిచినా 14 పాయింట్లే ఉంటాయి. దీనిప్రకారం ఆ జట్టు సొంతంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. మిగతా టీమ్‌లపై ఆధారపడాల్సిందే. అవి భారీ తేడాలతో ఓడిపోవడం లేదా మ్యాచ్‌లు రద్దవడం జరగాలి.
Similar News
News December 17, 2025
చేతిలో డబ్బు నిలవాలంటే..

ధనం వస్తూ ఖర్చు అవుతూ ఉంటే, ఇంట్లో దానిమ్మ లేదా అరటి మొక్క దగ్గర రోజూ సాయంత్రం దీపం వెలిగించాలి. ప్రతి సోమవారం శ్రీసూక్తం పఠిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలాగే, శ్రీయంత్రం, కనకధారా యంత్రం, కుబేర యంత్రం ఈ మూడింటిని పూజా మందిరంలో ఉంచి, రోజూ పూజిస్తే లక్ష్మీకటాక్షం లభించడం తథ్యం. ఇలా చేయడం ద్వారా డబ్బు నిలవక పోవడం అనే సమస్య తగ్గుతుంది.
News December 17, 2025
సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News December 17, 2025
ముగిసిన పోలింగ్.. కాసేపట్లో ఫలితాలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చివరి విడత పోలింగ్ పూర్తయింది. 3,752 సర్పంచ్ స్థానాల్లో 12,652 మంది, 28,410 వార్డు స్థానాల్లో 75,725 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు తెర పడనుంది.


