News October 8, 2025
RDT కోసం చేసిన పోరాటం ఫలించినట్లేనా?

RDTకి FCRA రెన్యువల్ కోసం కొన్ని నెలలుగా వివిధ సంఘాల నాయకులు, ప్రజలు చేస్తున్న పోరాటం ఫలించినట్లు తెలుస్తోంది. FCRA రెన్యువల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే శుభవార్త వెలువడనున్నట్లు SAVE RDT పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్..!
Similar News
News January 22, 2026
ADB: పురు పోరు.. కమిషనర్‌ల బదిలీలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. బుధవారం 47 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ఏడుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది.
News January 22, 2026
గెలుపు బాధ్యత పార్టీ MLAలు, ఇన్‌ఛార్జులకు అప్పగింత

TG: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు పూర్తి బాధ్యతను పార్టీ MLAలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు BRS అప్పగించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీకి సమర్థులైన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వీరికే వదిలిపెట్టింది. ప్రచార అజెండా నిర్ణయంతో సహా పోల్ మేనేజ్మెంటు అంశాలనూ వీరే నిర్ణయించాలని నిర్దేశించింది. ఛైర్మన్, మేయర్ ఇతర పదవులకు ఎంపిక బాధ్యతనూ MLAలు, ఇన్‌ఛార్జులకే ఇచ్చింది.
News January 22, 2026
నిర్మల్: పుర పోరు.. సీఎం స్పెషల్ ఫోకస్

నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాల్లో BJPని నిలువరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నిర్మల్ సభ వేదికగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగించి కేడర్‌లో ఉత్సాహం నింపారు.


