News August 11, 2025

RDT సంస్థకు గుడ్‌న్యూస్

image

RDT సంస్థకు FCRA రెన్యువల్ విషయమై జిల్లా ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, శ్రీనివాసులు, సురేంద్రబాబు, MS రాజు, దగ్గుపాటి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. విదేశీ నిధులు నిలిచిపోవడంతో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయనకు వివరించారు. జిల్లా నేతల వినతితో స్పందించిన అమిత్ షా వారం రోజుల్లో సంస్థకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ బీకే తెలిపారు.

Similar News

News March 15, 2026

గుత్తి కోటలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే!

image

గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి గుత్తి కోట వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం అదే గ్రౌండ్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, అతిథుల ప్రసంగం, సంధ్యామూర్తి శ్రీ నృత్య కళానిలయం వారి శివ పాదం, (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ, గంగమ్మ జాతర చేయనున్నారు.

News March 15, 2026

శ్రీకాకుళం: కాసులు కురిపిస్తున్న మొగలిరేకులు

image

శ్రీకాకుళంలోని ఉద్దానంలోని “మొగలి” డొంకలు సహజ రక్షణ కవచంలా తీరప్రాంతాన్ని కాపాడటంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు చక్కని ఆదాయం వనరుగా మారాయి. దట్టంగా పెరుగుతూ సహజ రక్షణ గోడగా నిలుస్తూ తీరప్రాంతాన్ని తుపాన్ల నుంచి కాపాడుతున్నాయి. మొగలిరేకులు నుంచి తయారుచేసే అత్తరుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో సీజన్లో కొన్ని కుటుంబాలు ఈ అత్తరు తయారిని కుటీర పరిశ్రమగా నిర్వహించి, మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి.

News March 15, 2026

నాగర్‌కర్నూల్: ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,630 మంది విద్యార్థులు హాజరుకాగా, 21 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు రాని విద్యార్థుల వివరాలను సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.