News June 17, 2024
రియల్ హీరో.. విశ్వక్‌సేన్‌పై ప్రశంసలు

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరణానంతరం అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘మెట్రో రెట్రో’ పేరిట జరిగిన కార్యక్రమలో ఈ ప్రతిజ్ఞ చేశానని ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. దీంతో విశ్వక్ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రియల్ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ, జగపతి బాబు అవయవదానం ప్రతిజ్ఞ చేశారు.
Similar News
News January 18, 2026
రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారింది: మాజీ మంత్రి

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్‌గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.
News January 18, 2026
నీటి నిల్వకు ఇంకుడు గుంత ఎక్కడ తవ్వాలి?

ఇంకుడు గుంతను ఇంటి బయట ఈశాన్య దిశలో(పిశాచ స్థానంలో) నిర్మించడం వల్ల నీటి ఎద్దడి తప్పుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే, అన్ని సందర్భాల్లో ఈశాన్యంలోనే నీరు పడాలని లేదు కాబట్టి బోరుకు దగ్గరగా ఎక్కడైనా గుంత ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవాలని, కఠినమైన నియమాల కంటే అవసరానికి తగ్గట్టుగా శాస్త్రాన్ని అనువైన రీతిలో మార్చుకోవాలని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>