News March 31, 2024

తొలి ఐపీఎల్ టీమ్‌గా రికార్డు

image

ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK అరుదైన ఘనత అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి IPL టీమ్‌గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలోనూ చెన్నై డామినేషన్ కొనసాగుతోందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఆ తర్వాతి స్థానాల్లో ఆర్సీబీ 13.5M, ముంబై ఇండియన్స్ 13.2M ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాయి.

Similar News

News February 10, 2026

తాబేలు ఉన్న ఉంగరాన్ని ధరిస్తే..?

image

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక కష్టాలు తొలగి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి తాబేలు ఉంగరం ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. ‘ఈ ఉంగరాన్ని ముందుగా పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. ముందుగా లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి. గురువారం ఈ ప్రక్రియ పూర్తి చేసి, శుక్రవారం నాడు కుడిచేతి చూపుడు/మధ్య వేలుకు ధరించాలి. ఉంగరం పెట్టుకున్నప్పుడు తాబేలు ముఖం మీ వైపు ఉండేలా చూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News February 10, 2026

216 గంటల భరతనాట్యంతో ప్రపంచ రికార్డు

image

కర్ణాటకలోని ఉడిపికి చెందిన 23 ఏళ్ల విదుషి దీక్ష భరతనాట్యం చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు. 216 గంటల పాటు నిరంతరాయంగా భరతనాట్యం ప్రదర్శించి, తన 170 గంటల పాత రికార్డును బద్దలు కొట్టి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. డాక్టర్ జి. శంకర్ మహిళా కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రదర్శన సమయంలో ప్రతి మూడు గంటలకు కేవలం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటూ ఆమె ఘనతను సాధించారు.

News February 10, 2026

మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

<>మహారాష్ట్ర <<>>కొల్హాపుర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ సొసైటీ 31 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. MBBS అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 68ఏళ్ల వయసు లోపు ఉండాలి. ఫిబ్రవరి 17న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in