News May 2, 2024

12 జిల్లాలకు రెడ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మూడు రోజుల పాటు 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఈ నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ తెలిపింది. పిల్లలు, వృద్ధులపై వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు.

Similar News

News December 11, 2025

ట్రంప్‍‌‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆశా జనకంగా చర్చలు సాగాయి. రీజినల్, ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్స్‌పై కూడా చర్చించాం. గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, శ్రేయస్సు కోసం ఇండియా, అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన తర్వాత జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News December 11, 2025

గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.

News December 11, 2025

ఓటమిని తట్టుకోలేక పురుగు మందు తాగింది..

image

TG: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాహైమద్‌పల్లిలో సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఓటమిని తట్టుకోలేక అభ్యర్థి లక్ష్మి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.