News March 27, 2024
రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన?

తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుందట. ప్రస్తుతం 33 జిల్లాలుండగా వాటిని 17కు కుదించే అవకాశం ఉందని సమాచారం. ఏపీ తరహాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.
Similar News
News February 18, 2026
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు!

TG: 2025-2028కు సంబంధించి ప్రైవేటు ఇంజినీరింగ్ ఫీజులను రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC) ఖరారు చేసింది. 70 కాలేజీల్లో పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయించింది. 63 కళాశాలల్లో పెంచగా, 19 కాలేజీల్లో తగ్గించింది. ఓ సంస్థలో అత్యధికంగా ₹62 వేలు పెరిగింది. CBITలో అత్యధికంగా ₹1.83 లక్షల ఫీజు ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి ఈ మేరకు TAFRC నివేదిక పంపింది. త్వరలో జీవో వచ్చే అవకాశం ఉంది.
News February 18, 2026
EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 18, 2026
నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.


