News July 28, 2024
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విడుదల

AP: పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో YCP మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు <<13721857>>మోహిత్<<>> రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు. నిన్న ఆయనను తిరుపతి పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం తిరుపతి SV యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించారు. ఈక్రమంలో మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ నాయకులు భారీగా వచ్చారు.
Similar News
News February 28, 2025
అంతరిక్షంలోకి హాలీవుడ్ సింగర్

హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ స్పేస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ఈ ఏడాది న్యూ షెపర్డ్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అందులో ఆరుగురు సభ్యులు గల మహిళా బృందం వెళ్లనుంది. పెర్రీతో పాటు బెజోస్ ఫియాన్సీ సాంచెజ్, నటి గెయిల్ కింగ్, సామాజిక కార్యకర్త అమండా, నిర్మాత కరియన్నె ఫ్లిన్, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ ఐషా బొవే వెళ్లనున్నారు.
News February 28, 2025
త్రివేణీ సంగమం వద్ద అగ్నిప్రమాదం

మహా కుంభమేళా జరిగిన ప్రాంతంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించారు. త్రివేణీ సంగమం వద్ద ఉన్న శాస్త్రి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మహా కుంభమేళా జరిగిన రోజుల్లోనూ పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. బుధవారంతో కుంభమేళా ముగిసింది.
News February 28, 2025
చరిత్రలో ఈరోజు.. ఫిబ్రవరి 28

* జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం
* ప్రపంచ దర్జీల దినోత్సవం
* 1927- భారత మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ జననం
* 1928- విద్యా, సామాజికవేత్త తుమ్మల వేణుగోపాల రావు జననం
* 1948- రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం
* 1963- భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మరణం(ఫొటోలో)