News February 17, 2025

యాపిల్‌ను వెనక్కి నెట్టిన రిలయన్స్

image

అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్‌ల జాబితాలో రిలయన్స్ టాప్-2లో నిలిచినట్లు ‘ఫ్యూచర్‌బ్రాండ్’ ప్రకటించింది. యాపిల్, నైక్ వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టడంతో పాటు ఆ జాబితాలో ఏకైక భారత బ్రాండ్‌గా రిలయన్స్ నిలిచింది. అటు శాంసంగ్‌కు తొలి స్థానం దక్కింది. మార్కెట్ మార్పులను ముందే ఊహించి నిర్ణయాలు తీసుకోవడం, బ్రాండ్ ప్రయోజనాలను ఉత్తమంగా నెరవేర్చడం, తదితరాల ఆధారంగా ‘ఫ్యూచర్‌బ్రాండ్’ జాబితా రూపొందిస్తుంది.

Similar News

News April 17, 2026

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగం చేయాలి

image

భద్రాద్రి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 40 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి కేసులో దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని, చార్జ్‌షీట్లు దాఖలు చేయాలన్నారు.

News April 16, 2026

వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

image

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.