News March 31, 2024
ధోనీకి రెస్ట్.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం?

వరుస విజయాలతో దూసుకెళ్తున్న CSK ఇవాళ్టి మ్యాచ్‌లో ధోనీకి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖలో నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కి కెప్టెన్ కూల్ దూరంగా ఉండగా.. తెలుగు క్రికెటర్ అరవెల్లి అవనీశ్‌రావు కీపింగ్ ప్రాక్టీస్ చేశారు. దీంతో ఇవాళ ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో అవనీశ్ అరంగేట్రం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ క్రికెటర్ U-19 వరల్డ్ కప్‌లో బ్యాటింగ్, కీపింగ్‌లో సత్తా చాటారు.
Similar News
News February 19, 2026
తెలుగు రాష్ట్రాల తీరుపై CWC అసంతృప్తి

TG: జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల వైఖరిపై CWC అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇవ్వాల్సిన అజెండాను AP, TG పంపకపోవడంతో JAN 30న జరిగిన భేటీ నిర్ణయాలు లేకుండానే ముగిసింది. తదుపరి భేటీకి 10 రోజుల్లో అజెండా పంపిస్తామని రెండూ అప్పట్లో చెప్పాయి. అయితే 20 రోజులైనా వాటి జాడలేదు. దీనిపై కమిషన్ సీరియస్ అయినట్లు సమాచారం. దీనిపై TG అధికారులు స్పందిస్తూ నెలాఖరుకు అందిస్తామని తెలిపారు.
News February 19, 2026
మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.
News February 19, 2026
చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

చర్మంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.


