News August 25, 2024

రేవంత్ హీరోలా పోజులు కొడుతున్నాడు: ఈటల

image

TG: హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో CM రేవంత్‌పై BJP MP ఈటల ఫైర్ అయ్యారు. ‘4 రోజుల నుంచి రేవంత్ హీరోలా హైడ్రామా చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దమ్ములేక ఈ పని పెట్టుకున్నారు. చట్టాన్ని పక్కనపెట్టి నీ తాత జాగీరులా, నువ్వేదో హీరోలా, నీ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా పోజులు కొట్టడం సరికాదు. పెద్దల అక్రమ నిర్మాణాలు కూలిస్తే మంచిదే కానీ పేదలపై ప్రతాపమా?’ అని ప్రశ్నించారు.

Similar News

News September 14, 2024

కారుపైకి ఎక్కి జగన్‌కు ముద్దుపెట్టిన అభిమాని

image

AP: YS జగన్ జిల్లాల పర్యటనలో భద్రతా వైఫల్యం ఉందని YCP శ్రేణులు విమర్శిస్తున్నాయి. నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురంలో జగన్ పర్యటిస్తుండగా.. ఓ అభిమాని కారుపైకి ఎక్కి జగన్‌పై పడిపోతూ ముద్దులు పెట్టిన ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నాయి. అతడు జగన్ వద్దకు దూసుకెళ్తుంటే మాజీ MLA జక్కంపూడి రాజా అతడి కాలు పట్టుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు భద్రత పెంచాలని YCP శ్రేణులు కోరుతున్నాయి.

News September 14, 2024

మా దేశం సురక్షితమే.. భారతీయులు రండి: ఇరాన్

image

ఇరాన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా పర్యాటకం బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తమ దేశానికి రావాలంటూ భారత్‌లో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు ఎప్పటి నుంచో ఉన్నవే. మా దేశం చాలా సురక్షితం. భారత మిత్రులు వచ్చి పర్యటించండి’ అని కోరారు. ప్రస్తుతం ఇరు దేశాలకు మధ్య 2 విమానాలు మాత్రమే డైరెక్ట్‌గా నడుస్తుండగా, అవి మరింతగా పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

News September 14, 2024

ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా?: BRS

image

TG: RR జిల్లా యాచారంలో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా? అని BRS పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘గతంలో ఫార్మాసిటీ రద్దు చేస్తానని చెప్పిన CM రేవంత్ 13వేల ఎకరాలను అమ్మే కుట్రపన్నారు. కోర్టు అక్షింతలు వేయడంతో మాట మార్చి ఫార్మాసిటీ ఉందంటున్నారు. ఫార్మాసిటీ రద్దు చేస్తే ఆ భూములు వెంటనే రైతులకు ఇవ్వాలి. ఫ్యూచర్ సిటీ, AI సిటీ అంటూ CM ఫేక్ ప్రచారం చేస్తున్నారు’ అని BRS దుయ్యబట్టింది.