News February 7, 2025
ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా సమావేశమయ్యారు. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గేతో చర్చించే అవకాశం ఉంది.
Similar News
News February 12, 2026
ఈ నెల 16న ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక

TG: 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 16న కలెక్టర్ల పర్యవేక్షణలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. రేపు కౌంటింగ్ జరగనుండగా గెలిచిన అభ్యర్థులు 16న ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మ.12.30 గంటలకు మెజార్టీ ఆధారంగా ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎంపికలో ఎక్స్‌అఫీషియో(MPలు, ఎమ్మెల్యేలు, MLCలు) సభ్యుల ఓట్లూ కీలకం కానున్నాయి.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.
News February 12, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


