News September 5, 2024

రేవంత్‌రెడ్డి.. అలాగైతే మీ అంత మూర్ఖుడు ఉండడు: KTR

image

TG: BRS సోషల్ మీడియా ఇన్‌ఛార్జి కొణతం దిలీప్‌ అరెస్ట్‌పై KTR స్పందించారు. ‘రేవంత్ రెడ్డి.. ఏ తెలంగాణా బిడ్డనైనా చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి భయపెట్టవచ్చని మీరు అనుకుంటే మీ అంత మూర్ఖుడు ఉండరు. మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్టు చేశారు. మీరు ఎంత ప్రయత్నించినా, మేము మీ అకృత్యాలను, వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని నేను మీకు హామీ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 12, 2024

23 దంతాలు తొలగించి 12 ఇంప్లాంట్ చేశారు.. చివరికి!

image

సాధారణంగా ఒక్క దంతాన్ని తొలగించి మరొకటి ఇంప్లాంట్ చేసిన నొప్పినే భరించడం కష్టం. కానీ, చైనాకు చెందిన హువాంగ్ సమ్మతితో 23 దంతాలను తీసివేసి 12 దంతాలను ఇంప్లాంట్ చేయడంతో చనిపోయారు. చికిత్స తర్వాత హువాంగ్ నిరంతరం తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. ఆపరేషన్ పూర్తయిన 13 రోజుల తర్వాత గత నెల 28న హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.

News September 12, 2024

కమ్యూనిస్ట్ దిగ్గజం సీతారాం ఏచూరి ప్రస్థానమిదే..

image

★1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిక
★1977-78లో మూడుసార్లు జేఎన్‌యూ అధ్యక్షుడిగా ఎన్నిక
★1978లో SFI అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఎన్నిక
★1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నిక
★2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నిక
★2015, 18, 22లో సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీగా ఎన్నిక

News September 12, 2024

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే ఛాన్స్: పంకజ్ జైన్

image

డిసెంబర్ 2021 తర్వాత తొలిసారి క్రూడాయిల్ ధర 70 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. మరికొన్నాళ్లు ఇదే రేటు కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ వెల్లడించారు. చమురు ఉత్పత్తిని పెంచాలని OPEC+ దేశాలను ఇండియా కోరడంతోపాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కొనుగోళ్లను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.