News March 7, 2025
REWIND: ఎలిమినేటిని హిట్ లిస్ట్‌లో పెట్టి చంపేశారు!

<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో హోం మినిస్టర్ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. గద్దర్‌పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్‌వార్ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్ ఎన్‌కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్‌వార్ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లో చేర్చి చంపింది.
Similar News
News December 16, 2025
పాడేరు: ‘మ్యూటేషన్ల ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలి’

జిల్లాలో రెవిన్యూ రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. మరలా గ్రామ సభలు నిర్వహించే నాటికి రీసర్వే పూర్తి చేయాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. రీ సర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, డీ పట్టా ల్యాండ్స్ పూర్తిగా పరిశీలించి, వెబ్ ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.
News December 16, 2025
కామారెడ్డి: మూడో విడతలో 462 మంది సర్పంచ్ అభ్యర్థులు

కామారెడ్డి మూడో విడత ఎన్నికల్లో భాగంగా 142 గ్రామపంచాయతీ స్థానాలకు రేపు బుదవారం జరగనున్న ఎన్నికల్లో 462 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే 1,020 వార్డులకు గాను 2,790 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో రేపటి వరకు వేచి చూడాలి.
News December 16, 2025
మహిళలూ.. మీరూ షిఫ్టుల్లో పని చేస్తున్నారా?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకు స్త్రీ పురుష భేదం లేదు. ఉన్నతస్థానాలకు చేరాలంటే అన్ని షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉద్యోగంతోపాటు ఇంట్లో పనులు, పిల్లల బాధ్యతలూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం ముఖ్యం. రోజులో ఏదోక సమయంలో కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్రయత్నించాలి. పోషకాహారం తీసుకోవాలి. షిఫ్టుని బట్టి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాయామానికి కాస్త సమయం కేటాయించాలి.


