News March 26, 2024

REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

image

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.

Similar News

News February 12, 2026

అమరావతిని వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక

image

అమరావతిని ప్రాంతీయ సమీకృత వృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో విజయవాడ–గుంటూరు–అమరావతి ప్రాంతాన్ని లాజిస్టిక్స్, పరిపాలన, నైపుణ్యాల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాజధానిని అనుసంధానించి టైర్-2 పట్టణ సముదాయంగా రూపుదిద్దుతామని పేర్కొన్నారు. పునర్నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.

News February 12, 2026

అమరావతిలో మెరీనా ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

image

కృష్ణా నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమరావతి సమీపంలో భారీ మెరీనా నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. వెంకటపాలెం వద్ద పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో వినోదం, బోటింగ్, క్లబ్ హౌస్‌లు, గెస్ట్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నదీ తీరాన్ని ఆకర్షణీయంగా మార్చి దేశీయ-విదేశీ పర్యాటకులను రప్పించాలన్నది ఉద్దేశం. టెండర్ ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.

News February 12, 2026

గుంటూరు–విజయవాడ రైల్వే రద్దీకి చెక్.. కొత్త లైన్లపై కేంద్రం క్లారిటీ

image

పార్లమెంట్‌లో రైల్వే అభివృద్ధిపై ఎంపీ కృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. శావల్యాపురం–బాపట్ల కొత్త లైన్‌పై ప్రస్తుతం గుంటూరు, తెనాలి మార్గంలో సౌకర్యం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గుంటూరు–విజయవాడ రద్దీ తగ్గించేందుకు ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు, కోటిపల్లి–నర్సాపురం, గుంటూరు–బీబీనగర్, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. 4వ లైన్ డీపీఆర్‌కు సర్వేలు మంజూరయ్యాయి.