News March 31, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఇద్దరు CMలు

image

బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన బెజవాడ గోపాల రెడ్డి మద్రాసు రాష్ట్రంలోనే మంత్రిగా పని చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో 1955లో ఆయన CMగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17న CMగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం 297 రోజులు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
#ELECTIONS2024

Similar News

News February 13, 2026

మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

image

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.

News February 13, 2026

కాకాణి కుమార్తెకు నోటీసులు

image

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.

News February 13, 2026

నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

image

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.