News September 10, 2025
REWIND: వికారాబాద్ జిల్లాలో 309 మంది ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 2024, 25 సంవత్సరాల్లో వివిధ కారణాలతో 309 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. బతికి సాధించుకోవాలని పెద్దలు ఎంత చెబుతోన్న కొందరు చిన్న చిన్న కారణాలతో తనువు చాలించడం బాధాకరం. ఇకనైనా మనస్తాపాలు వీడి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం.
Similar News
News December 15, 2025
కొత్తకోట: గతంలో ఒక్క ఓటు ఓటమి.. 839 మెజారిటీతో గెలుపు

గతంలో కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన లక్ష్మిదేవి మాసన్న ఈసారి అప్పరాల సర్పంచ్‌గా భారీ మెజార్టీతో మాసన్న గెలుపొందారు. రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాసన్న స్థానిక ప్రత్యర్థి పై 839 భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో పలువురు గ్రామ నాయకులు వారికి అభినందనలు తెలిపారు.
News December 15, 2025
జగిత్యాల: దంపతులు ఇద్దరికీ సమాన ఓట్లు

పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో పోచమ్మల ప్రవీణ్ (8వ వార్డు), మంజుల (10వ వార్డు) దంపతులు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98, 98 ఓట్లు సమానంగా పోల్ అయ్యాయి. కాగా, ప్రవీణ్ రామన్నపేట ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని BRS బలపరిచింది.
News December 15, 2025
జగిత్యాల: 3వ విడత ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

జగిత్యాల జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల కోసం సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 1306 మంది POలు, 1706 మంది APOలను కేటాయించారు. సిబ్బంది నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాజగౌడ్, అబ్జర్వర్ రమేష్‌తో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.


