News February 17, 2025
REWIND: 2019 కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు

2019లో కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు జరగగా పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్(PDF) నుంచి కలగర సాయి లక్ష్మణరావు(KS లక్ష్మణరావు) ఎన్నికయ్యారు. కాగా ఆ ఎన్నికలలో మొత్తం 1,49,319 ఓట్లు పోలవ్వగా విజేతగా నిలిచిన లక్ష్మణరావు 80,670, 2వ స్థానంలో ఉన్న నూతలపాటి అంజయ్య 12,550 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో లక్ష్మణరావుకు 68,120 ఓట్ల మెజార్టీ లభించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
Similar News
News April 18, 2026
బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 18, 2026
భద్రాచలంలో నేడు జాబ్ మేళా

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సేల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. ఎంపికైన వారికి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభిస్తుంది. 18-29 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి నుంచి పీజీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాలకు 9989209575 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News April 18, 2026
వచ్చే సీజన్‌కు KKR కోచ్‌గా మెక్‌కల్లమ్: పీటర్సన్

వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ వస్తారని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అంచనా వేశారు. ఇది జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తూ తన ట్వీట్‌ను బుక్ మార్క్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా 2022 నుంచి మెక్‌కల్లమ్ కొనసాగుతున్నారు. గతంలో KKRకు ఆడారు. మరోవైపు KKR పేలవ <<19678736>>ప్రదర్శన<<>> కొనసాగుతోంది. ఒక్క గెలుపూ లేక పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.


