News April 2, 2024
RGM: ఎన్టిపిసి వార్షిక ఉత్పత్తి వివరాలు

రామగుండం NTPC 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1600 మెగావాట్ల తెలంగాణ ప్లాంటులో మార్చి 29 నాటికి 37.12 మి. యూ, 2600 మెగావాట్ల ప్లాంట్‌లో మార్చి 26 నాటికి 16,645 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి నమోదయింది. NTPC రిజర్వాయర్‌లోని 100 MV ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లో 164.21 మి.యూ.కు గాను 196.17మి.యూ.తో 15.58 శాతం అధిక ఉత్పత్తి నమోదు చేసిందని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.
News February 12, 2026
KNR: ‘సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి’

KNR మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. గర్భిణీలు, పిల్లల వార్డును సందర్శించి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడి సమావేశ మందిరంలో గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులు తదితరులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని వైద్య బృందానికి సూచించారు.
News February 12, 2026
కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.


