News November 19, 2025
RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.
Similar News
News January 19, 2026
Photo Gallery: మేడారంలో CM కుటుంబం, మంత్రులు

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఇటీవల నిర్మించిన నూతన గద్దెలను పున:ప్రారంభించారు. అనంతరం మనవడితో కలిసి నిలువెత్తు బంగారం సమర్పించారు. సీఎం సతీమణి, కూతురు, అల్లుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
News January 19, 2026
NGKL: తెలుగు సాహిత్యానికి రుక్మంధ రెడ్డి జీవితం అంకితం

వెల్దండ మండలానికి చెందిన ప్రముఖ పద్య కవి <<18894607>>రుక్మంధర రెడ్డి<<>> తన జీవితాన్ని మొత్తం సాహిత్యానికే అంకితం చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా, పదవీ విరమణ అనంతరం తెలుగు అధ్యాపకుడిగా వందల మందిని తెలుగు సాహిత్య వేత్తలుగా, తెలుగు ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. పది పుస్తకాలను రచించారు. ఎందరో వర్తమాన కవులకు సాహిత్య మెలకువలను అందించారు. ఎన్నో సన్మానాలను, అవార్డులను అందుకున్నారు.
News January 19, 2026
40 ఏళ్లు నిండాయా? ఈ టెస్టులు చేయించుకోండి

40 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ మార్పులు, నెలసరి సమస్యలు, మెనోపాజ్ వేధిస్తుంటాయి. తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వారు కొన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఏడాదికోసారి ఫుల్ బాడీ చెకప్, షుగర్, BP, కొలెస్ట్రాల్, థైరాయిడ్ టెస్టులు, 2-3 ఏళ్లకోసారి సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, బోన్ హెల్త్ టెస్టు, 1-2 ఏళ్లకు కంటి, డెంటల్ పరీక్షలు, మెంటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి.


