News November 19, 2025

RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

image

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.

Similar News

News January 20, 2026

ఆర్టీఐ ద్వారా ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వాలి: చీఫ్ కమిషనర్

image

AP: ప్రజలు అడిగిన సమాచారాన్ని సమయానికి ఇవ్వకపోతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలోని ఆర్టీఐ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర సమాచారం సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని తెలియజేశారు.

News January 20, 2026

హైదరాబాద్‌కు అండర్ గ్రౌండ్ రివర్

image

HYD దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్లతో ‘అండర్ గ్రౌండ్ రివర్’ను సృష్టిస్తోంది. ఇప్పటిదాకా మనం విన్నది కేవలం పైప్‌లైన్‌ల గురించి మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం సిటీకి 50 ఏళ్ల వాటర్ గ్యారెంటీ ఇవ్వడం. 50 TMC మల్లన్నసాగర్‌ను ఒక భారీ ‘పవర్ బ్యాంక్’లా వాడుకుంటూ అందులోని 20 TMCలను సిటీకి మళ్లించబోతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి.

News January 20, 2026

ప్రజల గొంతుకలపై అక్రమ కేసులా: మహబూబాబాద్ మాజీ ఎంపీ

image

మహబూబాబాద్ మాజీ ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో BRS జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత మాలోత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీశ్ రావును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి BRSపై తన అక్కసు వెళ్లగక్కారని, రాష్ట్రంలో BRS జెండాపై జరిగే దాడులకు ఆయనే బాధ్యత వహించాలన్నారు.