News November 19, 2025
RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.
Similar News
News January 24, 2026
‘సర్, ప్లీజ్ చేయి తీయండి’.. మౌనీ రాయ్‌కు చేదు అనుభవం

బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ వేడుకలో స్టేజ్ వైపు వెళ్తున్న సమయంలో ఫొటోలు తీసుకునే నెపంతో కొందరు ప్రేక్షకులు నడుముపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె వెల్లడించారు. “సర్, ప్లీజ్ చేయి తీయండి” అని అడిగితే వారు మరింత దురుసుగా స్పందించారని తెలిపారు. స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా అసభ్య సైగలతో వేధించారని పేర్కొన్నారు.
News January 24, 2026
మంచిర్యాల: కార్పొరేటర్ టికెట్ @రూ.50లక్షలు

కొత్తగా ఏర్పడిన MNCL కార్పొరేషన్‌లో కార్పొరేటర్ పదవి “కోట్ల”తో ముడిపడి ఉంది. రూ.50లక్షలు ఖర్చు చేయగలవారికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. BJP, BRSలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి. ఒక్కో డివిజన్‌లో 2500 -3500 ఓటర్లు ఉండగా ఓటుకు రూ.1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు బేరీజు వేస్తున్నారు. 60 డివిజన్లలో కలిపి ఒక్కో పార్టీ సుమారు రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.
News January 24, 2026
సిద్దిపేట: చేనేత కార్మికులకు రుణ మాఫీ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు కార్మికులు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసినట్లు జౌళి శాఖ సంచాలకులు సాగర్ తెలిపారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 7 మంది కార్మికులకు సంబంధించి రూ. 5 లక్షల నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


