News May 1, 2024

రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు: రాయుడు

image

T20 WC జట్టులో రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘అతడిని తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్‌ కంటే గణాంకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు ఎంపికైన ప్లేయర్లలో జడేజా మినహా ఏ ఆటగాడు గత రెండేళ్లలో చివరి ఓవర్లలో అధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మ్యాచును గెలిపించారు?. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 15, 2025

EVMలను నమ్మలేం: వైవీ సుబ్బారెడ్డి

image

ఏపీలో ఎన్నికల అక్రమాలపై ఈసీ విచారణ జరపాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఓట్లలో అనేక తేడాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఈవీఎంలను నమ్మలేమని, పేపర్ బ్యాలెట్‌పైనే అందరికీ నమ్మకం ఉందని రాజ్యసభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు.

News December 15, 2025

హీరోయిన్‌ ఈషాతో తరుణ్ భాస్కర్ పెళ్లి?

image

టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో టాక్. ఇద్దరూ వరంగల్‌కు చెందిన వారే కావడం గమనార్హం. కాగా తరుణ్‌కి ఇప్పటికే పెళ్లి కాగా, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

News December 15, 2025

లంగ్స్‌కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

image

‘గోట్ టూర్‌’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్‌కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.