News May 1, 2024
రింకూకు ‘ఇంపాక్ట్’ దెబ్బ!

రింకూ సింగ్‌కు T20WC జట్టులో చోటు దక్కకపోవడానికి ఐపీఎల్ ఇంపాక్ట్ నిబంధనే కారణమని విశ్లేషకులు అంటున్నారు. కేకేఆర్ టాప్‌ఆర్డర్ ఫామ్‌లో ఉండటంతో ఈ ఐపీఎల్లో రింకూకు పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు చెన్నై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా టాప్ ఆర్డర్‌లో బరిలోకి దిగుతున్న శివమ్ దూబే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 350 రన్స్ చేసిన దూబే భారీ షాట్లు ఆడుతూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు.
Similar News
News December 15, 2025
హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్‌కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్‌నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.


