News November 30, 2025

RO-KO కంబ్యాక్.. ఎనీ డౌట్స్?

image

2027 ODI వరల్డ్ కప్‌ వరకు రోహిత్, విరాట్ కొనసాగగలరా అనే డౌట్స్ రాంచీ వేదికగా SAతో జరుగుతున్న తొలి వన్డేతో దాదాపు క్లియర్ అయిపోయాయి. రోహిత్‌ మెరుపు అర్ధశతకం (51 బంతుల్లో 57)తో సమాధానం చెప్పగా, కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల(11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో తన పవర్ చూపించారు. ఈ జోడీ 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. అభిమానులలోని సందేహాలను దూరం చేసింది. RO-KO కంబ్యాక్‌ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News February 10, 2026

US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

image

H-1B వీసా ప్రోగ్రామ్‌ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.

News February 10, 2026

దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

image

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.

News February 10, 2026

బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

image

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.