News June 14, 2024
కూతురితో రోహిత్ ఆట.. క్యూట్ ❤️ ఫొటో
T20WCలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాళీ టైమ్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. కెనడాతో చివరి మ్యాచ్ కోసం ఫ్లోరిడా చేరుకున్న ఆయన అక్కడి బీచ్‌లో ఇసుక గూళ్లు కడుతూ కూతురితో ఆడుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది క్యూటెస్ట్ ఫొటో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 18, 2024
నటి CID శకుంతల కన్నుమూత
దక్షిణాది నటి CID శకుంతల(84) కన్నుమూశారు. బెంగళూరులో ఛాతి నొప్పితో నిన్న తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో దాదాపు 600 సినిమాల్లో, పలు సీరియళ్లలో నటించారు. MGR, శివాజీ వంటి లెజెండరీ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో బుద్ధిమంతుడు, నేను మనిషినే వంటి పలు సినిమాల్లో ఆమె కనిపించారు.
News September 18, 2024
ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. ఎప్పుడంటే?
ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
News September 18, 2024
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా డిసెంబర్ కోటా ఆన్‌లైన్ టికెట్లను TTD రిలీజ్ చేసింది. ఈ నెల 20న ఉ.10 గంటల వరకు నమోదుకు అవకాశమిచ్చింది. 21న మ.3 గంటలకు వర్చువల్ టికెట్లు రిలీజ్ చేయనున్నారు. 23న ఉ.10 గంటలకు అంగ ప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు రిలీజ్ చేస్తారు. 24న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటలకు వసతి కోటా విడుదల చేయనున్నారు.