News February 15, 2025

రోహిత్ శర్మకు షాక్.. WTCలో బుమ్రానే కెప్టెన్?

image

రోహిత్ శర్మను ఇకపై టెస్టులకు BCCI పరిగణనలోకి తీసుకోకపోవచ్చని PTI వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త WTC సీజన్‌లో బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందు జాగ్రత్తగానే NCAకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News April 14, 2026

నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

image

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News April 14, 2026

కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

image

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.

News April 14, 2026

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.