News March 12, 2025
2027 WC వరకూ రోహిత్ ఆడాలి: పాంటింగ్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ODI WC వరకూ ఆడాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆకాంక్షించారు. హిట్ మ్యాన్ భారత్‌కు మరో WC అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తాను ఇప్పుడే వన్డేలకు రిటైర్ కానని, భారత్‌కు నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన మాటలు చూస్తోంటే వచ్చే ODI WC అందించాలనే కసి కనిపిస్తోంది. ఆయన మనసులో అదే ఉందని భావిస్తున్నా’ అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చారు.
Similar News
News February 12, 2026
దోస పంటలో బోరాన్ లోప నివారణకు సూచనలు

దోస పంటలో బోరాన్ లోప లక్షణాలను గమనిస్తే లీటరు నీటికి 2 గ్రాముల బోరాక్స్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి ఎకరాకు 10 కిలోల బోరాక్స్‌ను దుక్కిలో వేసుకోవాలి. దీని వల్ల పంటలో మగ పువ్వులు తగ్గి దిగుబడిని పెంచే ఆడ పువ్వుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఆశించిన దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News February 12, 2026
ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డులుగా మార్చింది. ఇటీవల మంత్రివర్గం తెలిపిన ఆమోదం మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే.
News February 12, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


