News January 3, 2025

సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం.. స్పందించిన పంత్

image

సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంపై వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్పందించారు. ‘రోహిత్ ఓ నిఖార్సైన నాయకుడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎన్నో జరుగుతాయి. అవన్నీ మీకు నేను చెప్పలేను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ టెస్టు నుంచి హిట్‌మ్యాన్ స్వయంగా తప్పుకున్నారని కొందరు, తప్పించారని మరికొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Similar News

News January 24, 2025

నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు: హీరోయిన్

image

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో <<15056007>>వివాదం<<>> వేళ హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనానికి బాగా స్క్రాచెస్ పడ్డాయి. అయినా వాళ్లు ఆపలేదు. ‘‘పెద్దవాళ్లు’’ నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కాగా తనను చంపాలంటే చంపొచ్చని ఇటీవల మాధవీలత వ్యాఖ్యానించారు.

News January 24, 2025

ఫీజులోనూ ఈ వ్యత్యాసం ఎందుకు?.. విద్యార్థి ఆవేదన

image

పోటీ పరీక్షల్లో రిజర్వేషన్లను దాటుకొని సీటు సాధిస్తే.. ఫీజులోనూ వ్యత్యాసం చూపడం ఏంటని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ MBBS ఫీజు GENకి రూ.14లక్షలు, OBCకి రూ.8లక్షలు, SC/STకి 0, EWS విద్యార్థులకు రూ.7లక్షలు అని ఉంది. తమ తల్లిదండ్రులూ అప్పులు చేసి చదివిస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. ఇక్కడైనా రిజర్వేషన్ తీసేయాలని సూచిస్తున్నారు.

News January 24, 2025

సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది తన కొడుకు కాదని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తండ్రి రుహుల్ అమిన్ తెలిపారు. పోలీసులు తన కుమారుడిపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. తన కుమారుడు ఎప్పుడూ పొట్టి జుట్టుతోనే ఉంటాడని తెలిపారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్‌లో చాలా హత్యలు జరిగాయని, వాటిని చూసి భయపడి అతడు భారత్ వెళ్లాడని వివరించారు.