News July 6, 2024

టీ20 WC నెగ్గడంలో రోహిత్‌ది కీలక పాత్ర: గవాస్కర్

image

టీ20 WC టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభ తనను ఆకట్టుకుందని మాజీ ప్లేయర్ గవాస్కర్ అన్నారు. ‘జట్టు విజయంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు. బౌలింగ్‌లో బుమ్రా, బ్యాటింగ్‌లో కోహ్లీ చాంపియన్స్. వీరందరినీ నడిపించి జట్టును గెలిపించిన రోహిత్ ప్రధాన పాత్రధారి. క్లిష్ట పరిస్థితుల్లో నిస్పృహను దరిచేరనీయకుండా సమర్థంగా వ్యవహరించి కప్ నెగ్గేందుకు కారణమయ్యారు’ అని కొనియాడారు.

Similar News

News December 14, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.

News December 14, 2025

వార్డ్‌రోబ్ ఇలా సర్దేయండి

image

చాలామంది వార్డ్‌రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్‌రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్‌రోబ్ నీట్‌గా కనిపిస్తుంది.

News December 14, 2025

ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

image

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.