News August 12, 2025

పిల్లలను కన్నాక ఎట్టకేలకు రొనాల్డో నిశ్చితార్థం

image

పోర్చుగీస్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను నిశ్చితార్థం చేసుకున్నారు. జార్జినా తన ఇన్‌స్టాలో డైమండ్ రింగ్ ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. 2016 నుంచి సహజీవనం చేస్తున్న వీరికి ఎనిమిదేళ్లకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. రొనాల్డోకు జార్జినాతో కలిసి ఇద్దరు, సరోగసీ ద్వారా ముగ్గురు పిల్లలున్నారు. రొనాల్డో సౌదీ అరేబియాలో అల్-నసర్ క్లబ్ తరఫున ఆడుతున్నారు.

Similar News

News March 12, 2026

పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

image

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

News March 12, 2026

ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

image

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.

News March 12, 2026

పాపం జెన్‌జీలు

image

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.