News June 19, 2024
బోణీ కొట్టిన రొనాల్డో టీమ్

యూరో ఛాంపియన్ షిప్-2024లో క్రిస్టియన్ రొనాల్డో టీమ్ పోర్చుగల్ ఖాతా తెరిచింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచులో 2-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. తొలి అర్థభాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ నమోదు చేయలేదు. ద్వితీయార్ధంలో రెచ్చిపోయిన పోర్చుగల్ ప్లేయర్లు రెండు గోల్స్ చేశారు. మరో మ్యాచులో జార్జియాపై 3-1తో తుర్కియే గెలుపొందింది.
Similar News
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.
News January 14, 2026
జనవరి 14: చరిత్రలో ఈరోజు

1896: భారత ఆర్థికవేత్త సి.డి.దేశ్‌ముఖ్ జననం
1937: సినీ నటుడు రావు గోపాలరావు జననం
1937: సినీ నటుడు శోభన్ బాబు జననం(ఫొటో-R)
1951: సినీ దర్శకుడు జంధ్యాల జననం(ఫొటో-L)
1979: కవి కేసనపల్లి లక్ష్మణకవి మరణం
News January 14, 2026
సంక్రాంతి ప్రతిసారి ఒకే తేదీన ఎందుకు వస్తుంది?

దాదాపు మన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా వస్తుంటాయి. అందుకే క్యాలెండర్‌లో ఆ పండుగల తేదీలు మారుతుంటాయి. కానీ సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుపుకుంటాం. సూర్యుడు ప్రతి ఏడాది ఒకే సమయంలోమకర రాశిలోకి ప్రవేశిస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే ఈ కాలం స్థిరంగా ఉంటుంది. అందుకే JAN 14/15 తేదీలలోనే సంక్రాంతి వస్తుంది. ఇది ఖగోళ మార్పులకు సంబంధించిన పండుగ కాబట్టి తేదీల్లో మార్పు ఉండదు.


