News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.
News January 19, 2026
RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.
News January 18, 2026
మునిసిపల్ ఎన్నికలు.. అభ్యర్థులారా ఇవి తెలుసుకోండి

2026 మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు అర్హతలు, నామినేషన్ నిబంధనలు, ఖర్చు పరిమితులు తప్పక తెలుసుకోవాలి. భారత పౌరుడై 21 ఏళ్లు నిండాలి. సంబంధిత వార్డు ఓటరై ఉండాలి. పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజర్, స్వతంత్ర అభ్యర్థికి 10 మంది ప్రపోజర్లు అవసరం. ఖర్చు పరిమితి మునిసిపాలిటీ రకాన్ని బట్టి రూ.2-రూ.10లక్షల వరకుంటుంది. ప్రతి ఖర్చు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిక రద్దవుతుంది.


