News May 22, 2024

ఏదైనా మ్యాజిక్ చేస్తేనే RRకి విజయావకాశాలు: గవాస్కర్

image

IPLలో ఇవాళ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో RCB ఆధిపత్యం చూపే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. క్వాలిఫయర్-1లో KKRలా ఏదైనా మ్యాజిక్ చేస్తేనే రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలు ఉంటాయని అన్నారు. RCB వరుస విజయాలతో దూకుడు మీద ఉందని, వరుస ఓటములతో RR పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విశ్లేషించారు. నేటి మ్యాచులో RCB గెలవకపోతే మాత్రం ఆశ్చర్యకరమేనని వ్యాఖ్యానించారు.

Similar News

News February 15, 2025

WPL: ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో ముంబై ఇండియన్స్ 164 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్ స్కివర్ బ్రంట్(80*) అదరగొట్టగా కెప్టెన్ హర్మన్ ప్రీత్(42) ఫర్వాలేదనిపించారు. యస్తికా(11) మినహా ఇతర ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్నాబెల్ 3, శిఖా పాండే 2, కాప్సే, మిన్నూ చెరో వికెట్ వికెట్ తీశారు. DELHI టార్గెట్ 165.

News February 15, 2025

PHOTO: మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే!

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవ్వగా పాటల చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా సెట్‌లో ధోతీలో ఉన్న చిరంజీవి బ్యాక్ ఫొటోను దర్శకుడు పంచుకున్నారు. కీరవాణి కంపోజిషన్‌లో చిరు స్టెప్పులతో అదరగొట్టారని రాసుకొచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్‌కు ఇక పండగే అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News February 15, 2025

GREAT… చాయ్ ఓనర్ టూ మున్సిపల్ మేయర్

image

రాయగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జీవర్ధన్ చౌహాన్ ఘన విజయం సాధించారు. దీంతో ఇన్నాళ్లూ నగరంలో ‘టీ దుకాణం’ నడిపిన వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ తమ మేయర్ అభ్యర్థిగా జీవర్ధన్ ను ప్రకటించింది. సీఎం సైతం తన దుకాణంలో టీ అమ్ముతూ ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో పది మున్సిపల్ కార్పొరేషన్లను గెలిచి బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.

error: Content is protected !!